పయనించే సూర్యుడు న్యూస్ తాడిపత్రి ప్రతినిధి కుల్లాయప్ప 13
తాడిపత్రి పట్టణంలో మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో పనిచేస్తున్న కార్మికురాలు ప్రమీల అండర్ డ్రైనేజీ ఎస్టీ బి టు వద్ద పనిచేస్తూ ప్రమాదవశాత్తు డ్రైనేజీ కుంటలో పడి కార్మికురాలు తీవ్ర అస్వస్థతకు గురవడంతో తోటి కార్మికుల సహాయంతో సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు వెంటనే అక్కడికి చేరుకున్న సిఐటియు నాయకులు కార్మికురాలు పరిస్థితులపై డాక్టర్ వద్ద కనుగొన్నారు అనంతరం సిఐటియు నాయకులు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విభాగంలో పని చేస్తున్నటువంటి కార్మికురాలును ఏ ఈ ఎస్ తేజ డ్రైనేజీ వర్క్ ఎలా అప్పజెప్పుతారని అధికారులు కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని వాపోయారు కార్మికులపై ఇటువంటి దుస్థితి కొనసాగించకుండా అధికారులు చూడాలని లేని పక్షమున రానున్న కాలంలో అధికారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సిఐటియు నాయకులు హెచ్చరించారు సిఐటియు నాయకులు జగన్మోహన్ రెడ్డి ఉమా గౌడ్ హనుమంత్ రెడ్డి కార్మికురాలు పరిస్థితులపై డాక్టర్లతో కనుగొన్నారు