తెలంగాణ

మాతాజీ నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.

మాతాజీ నగర్ డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం.

నూతన డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి అధికారులకు ఎమ్మెల్యే కృష్ణారావు ఆదేశం

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్షేత్రస్థాయిలో పర్యటనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం బేగంపేట డివిజన్ పరిధిలోని మాతాజీ నగర్ కాలనీలో ఆయన పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా కాలనీవాసులు తమ ప్రాంతంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మురుగునీటి సమస్య కారణంగా నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించాలని విజ్ఞప్తి చేశారు.స్థానికుల విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో మాట్లాడి, మాతాజీ నగర్‌లో నూతన డ్రైనేజీ పైప్‌లైన్ నిర్మాణానికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని అక్కడికక్కడే ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పనులను త్వరితగతిన చేపట్టి, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్పష్టం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ప్రజలకు ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బేగంపేట డివిజన్‌లో సుమారు 80 శాతం అభివృద్ధి పనులను పూర్తి చేశామని పేర్కొన్నారు. నూతన రహదారుల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థల అభివృద్ధి, తాగునీటి పైప్‌లైన్లు, ఇతర మౌలిక సదుపాయాలతో పాటు శ్మశాన వాటికలు, పార్కుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తుచేశారు.అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మందగించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, పెండింగ్‌లో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ పర్యటనలో మాజీ కార్పొరేటర్ మహేశ్వరి శ్రీహరి, డివిజన్ అధ్యక్షులు సురేష్ యాదవ్, రాజయ్య, సంబంధిత అధికారులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS