పయనించే సూర్యుడుD.10.11.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. కమ్మర్పల్లిలో జరగనున్న 12వ జూనియర్ రాష్ట్ర సాఫ్ట్‌బాల్ పోటీలకు ఆహ్వానంరాష్ట్ర, జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొని కమ్మర్పల్లి గ్రామానికి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన క్రీడాకారులను బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించారు.ఈ నెల 14, 15 తేదీలలో కమ్మర్పల్లిలోని గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియంలో నిర్వహించనున్న 12వ తెలంగాణ రాష్ట్ర జూనియర్ సాఫ్ట్‌బాల్ బాలుర పోటీలకు ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించవలసిందిగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని ఆహ్వానించారు.ఈ సందర్భంగా జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, కమ్మర్పల్లి గ్రామ ఉపసర్పంచ్ అశోక్, ఫిజికల్ డైరెక్టర్ నాగభూషణం ఎమ్మెల్యే ని కలిసి రాష్ట్ర స్థాయి పోటీల ప్రారంభోత్సవాని కి ఆహ్వానించారు.అనంతరం కమ్మర్పల్లి గ్రామం నుండి రాష్ట్ర, జాతీయ స్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు: ఏ. మధుమిత కే. వర్షిత్ ఎల్. భవాని రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు:టీ. రిషిత ఎన్. భవ్య శ్రీ బి. రాణి ఎస్‌డి. బుష్రా ఏ. శర్వాణి వి. జయంత్ కే. సూర్య వర్మ కే. విద్యా తేజ ఆర్. రిశ్వంత్ ఏ. సుశాంత్ బి. నవదీప్ ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి గ్రీన్‌ఫీల్డ్ మినీ స్టేడియం సాఫ్ట్‌బాల్ కోచ్ రాహుల్, గ్రామ నాయకులు సాగర్ తదితరులు పాల్గొన్నారు.జిల్లా సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ మాట్లాడుతూ, కమ్మర్పల్లిలో రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్‌బాల్ పోటీల నిర్వహణకు సహకరిస్తున్న ప్రజాప్రతినిధులు, గ్రామ నాయకులు, క్రీడాకారులు, కోచ్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.