పయనించే సూర్యుడు నవంబర్ 10 ముమ్మిడివరం ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి ట్రెజరర్ గ్రంధి నానాజీ ఆధ్వర్యంలో బిజెపి గుంటూరు జిల్లా ఇంచార్జ్ యాళ్ల దొరబాబు పుట్టినరోజు వేడుకలు కాట్రేనికోనలో ఘనంగా జరిగాయి. వేద పండితుల వేదమంత్రోచ్చారణల మధ్య దొరబాబు అభిమానులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలవరపు చంటి, ఏ పనికాంత్, తాతపూడి శర్మ, చిట్టూరి గణేష్, పసర్ల శీను, ప్రసాదు, సెల్ షాప్ రాజు తదితరులు పలువురు దొరబాబు అభిమానులు పాల్గొన్నారు. దొరబాబు పార్టీ కోసం చేస్తున్న కృషిని, కార్యకర్తలకు అందిస్తున్న అండను నాయకులు కొనియాడారు. ఆయన నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణతో పార్టీలో అందరి మన్ననలు పొందుతున్నారని తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో, మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని, ప్రజాసేవలో ముందుండాలని అభిమానులు ఆకాంక్షించారు. రాబోయే రోజుల్లో దొరబాబుకు మరిన్ని మంచి పదవులు రావాలని, పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టాలని కోరుకున్నారు. ఆయన సేవలు కోనసీమ జిల్లాకే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలని, ప్రజల ఆశీస్సులతో ఉన్నత శిఖరాలకు చేరాలని నాయకులు ఆకాంక్షించారు.