తెలంగాణ

రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి. ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో *ఐదు గ్రామాల్లో కేంద్రాలు ప్రారంభించిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ దేగాం గ్రామం లో పలు అభివృద్ధి పనులు ప్రారంభం…రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు. మంగళవారం బైంసా మండలంలోని దేగాం, వాలెగాం, కుంసర, కామోల్, వానల్పాడ్, తిమ్మాపూర్, గ్రామాల్లో ఐకెపి ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బహిరంగ మార్కెట్లో ధర తక్కువగా ఉంటే రైతాంగానికి మద్దతు ధర కల్పించేందుకు ఈ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏ గ్రేడ్ రకం వరికి క్వింటాలకు 2461రూపాయల ధర, బి గ్రేడ్ రకం క్వింటాలుకు 2441 రూపాయల ధర, 7 సన్న రకాలకు అదనంగా క్వింటాలుకు 500 బోనస్ ఉంటుందన్నారు. కొనుగోలు కేంద్రాల ప్రారంభించి, ఆయన రైతులను సన్మానించారు. ఎల్. ని నో ప్రభావంతో రైతులు నష్టాల్లో ఉన్నారని, ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.దేగాం గ్రామంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం.దేగాం గ్రామంలో ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పెద్దమ్మ తల్లి ఆలయం వద్ద 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. అదేవిధంగా 10 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన మహిళా షెడ్డు భవనాన్ని ప్రారంభించారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చిత్తబుట్టలను పంపిణీ చేశారు. అంతకుముందు బిజెపి నాయకులు కిష్టయ్య కుమారుని వివాహం కావడంతో వారింటికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు.కామోల్ లో బిజెపి నాయకునికి పరామర్శ…ఇటీవల రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన బిజెపి నాయకుడు భోజరెడ్డి గాయపడంతో వారిని ఎమ్మెల్యే పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమాల్లో బైండ్ల రమేష్ , మరియు మాజీ ఎంపీపీ అబ్దుల్ రజాక్, మాజీ జడ్పీటీసీ సోలంకే భీమ్రావు, బైంసా మండల బిజెపి అధ్యక్షురాలు దేగాం సర్పంచ్ సిరం సుష్మారెడ్డి, సర్పంచ్లు అశోక్, చిన్నయ్య, నాగలక్ష్మివినోద్, సంజీవ్ , కుంసర సర్పంచ్, గంగాధర్ పటేల్, అశోక్, సుధాకర్, చందర్ పటేల్, మండల సీనియర్ నాయకులు, కార్యకర్తలు , రైతులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS