తెలంగాణ

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.

చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి.

పయనించే సూర్యుడుD.19.10.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్. జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన.మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి విజయదశమి పర్వదినం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.చెడుపై మంచి సాధించిన విజయానికి, ధర్మం అధర్మంపై గెలిచిన విజయానికి ప్రతీకగా విజయదశమి పండుగను జరుపుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ పర్వదినం ప్రతి ఒక్కరిలో నూతన ఉత్సాహాన్ని, సానుకూల ఆలోచనలను నింపాలని ఆకాంక్షించారు.విజయదశమి పండుగ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ చెడును విడనాడి, మంచిని ఆచరిస్తూ సమాజ శ్రేయస్సు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ప్రేమాభిమానాలు, ఐక్యత, సోదరభావం మరింత బలపడాలని ఆకాంక్షించారు.ఈ పండుగ పర్వదినాన జిల్లా ప్రజలందరికీ అన్ని రంగాల్లో విజయం చేకూరాలని, ప్రతి కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లివిరియాలని, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాల మధ్య విజయదశమి పండుగను జరుపుకోవాలని కోరుకుంటూ జిల్లా ప్రజలకు మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS