తెలంగాణ

నవరాత్రులు సమాజ ఐక్యతకు ప్రతీక

నవరాత్రులు సమాజ ఐక్యతకు ప్రతీక

ఎమ్మెల్సీ నాగర్ కుంట నవీన్ రెడ్డి

చటాన్ పల్లి దుర్గామాత మండపంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్ షాద్ నగర్ పట్టణంలోని చటాన్ పల్లిలో వెలిసిన దుర్గామాత మండపంలో శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అన్న వితరణ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీనవీన్ కుమార్ రెడ్డి హాజరై, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా,వర్గ భేదాలు లేకుండా ప్రజలందరూ ఒకే చోట చేరి నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం మన సంస్కృతి గొప్పతనానికి నిదర్శనమని నవీన్ రెడ్డి కొనియాడారు.సమాజంలోని ప్రతీ కుటుంబం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వాణి పాండురంగ రెడ్డి,నందారం అశోక్ యాదవ్,నాయకులు దినేష్ సాగర్, వెంకటరెడ్డి,మల్లేష్ ముదిరాజ్, రాఘవేందర్ రెడ్డి,సాయి రెడ్డి, మహేష్ గౌడ్,విక్రమ్ రెడ్డి,పేపర్ శివ, వంశీ రెడ్డి,శశిధర్ రెడ్డి, నాని, చందు,కార్తీక్, తదితరులు పాల్గొన్నారు

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS