భీంగల్ లో గాయత్రి బ్యాంక్ ప్రారంభించిన మానాల మోహన్ రెడ్డి.
పయనించే సూర్యుడుD.3.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ : బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ పట్టణ కేంద్రంలో ఈ రోజు శుక్రవారం రోజున రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి గాయత్రి బ్యాంకు మరియు కాప్రి గోల్డ్ లోన్ బ్రాంచి లను ప్రారంభించారు.గాయత్రి కోపరేటివ్ బ్యాంక్ 2000 సంవత్సరంలో ప్రారంభించి దినదిన అభివృద్ధి చెందుతూ భీంగల్ ఈరోజు ప్రారంభించుకున్న శాఖ 85వది 4,500 కోట్ల టర్నోవర్తో తెలంగాణ ఆంధ్రాలో నిర్వహిస్తున్నటువంటి బ్యాంకు మరింత ఆర్థిక పరిపుష్టి సాధించి మరింతగా ముందుకు వెళ్లాలని రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి అన్నారుఈ కార్యక్రమంలో భీంగల్ చైర్ పర్సన్ నాగమణి స్వామి వైస్ చైర్మన్ జై జై నరసయ్య గాయత్రి బ్యాంక్ రీజన్ హెడ్ అరుణకుమార్ బ్రాంచ్ హెడ్ జక్క సుమన్ కాప్రి గోల్డ్ లోన్ రీజినల్ మేనేజర్ సురేందర్ ఎఫ్ ఎస్ సి ఎస్ చైర్మన్ నరసయ్య కౌన్సిలర్లు నాగేంద్ర సంగ్య నాయక్ మాజీ ఎంపీపీ కన్నె సురేందర్ అనంత రావు బాబాపూర్ సర్పంచ్ సమీర్ మెండోరా సర్పంచ్ రమేష్ కారేపల్లి సర్పంచ్ మోతిలాల్ గోపాల్ శ్యామ్ రాజ్ మేకల శ్రీనివాస్ సురేష్ అజయ్ రాజేష్ చిన్నరెడ్డి నితీష్ తదితరులు పాల్గొన్నారు