చింతగూడ మరియు నెరెల్లచెరువు గ్రామాల్లో స్కూల్ బ్యాగుల పంపిణీ

ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బ్యాగుల పంపిణీ
ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు
( పయనించే సూర్యుడు మే 01 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య సమరయోధుడు మరియు బూర్గుల గ్రామ మాజీ సర్పంచ్ బూర్గుల నరసింగరావు మనవడు కపిల్ రాజారావు మెల్కోటి జ్ఞాపకార్థంగా చింతగూడ మరియు నెరెల్లచెరువు గ్రామాలలో 1వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు స్కూల్ బ్యాగులు మరియు పుస్తకాల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా చింతగూడలో 118 బ్యాగులు మరియు నెరెల్లచెరువులో 83 బ్యాగులు విద్యార్థులకు పంపిణీ చేయబడినవి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చింతగూడ సర్పంచ్ మేకొండ నరేష్, నెరెల్లచెరువు సర్పంచ్ భూపాల్ యాదవ్, డిప్యూటీ సర్పంచులు శంకరయ్య మరియు జావేద్, వార్డు సభ్యులు విజయ్, టి. రాజు, శిరీష, చింతగూడ కార్యదర్శి వీరబద్రప్ప, గ్రామ అభివృద్ధి చైర్మన్ శ్రీశైలం హాజరయ్యారు.ఈ సందర్భంగా జీరో మాల్న్యూట్రిషన్ హెడ్ ద్యాగ శంకర్ మరియు సీనియర్ ప్రోగ్రామ్ మేనేజర్ మురళీ కృష్ణ గారు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరించారు. బాగా చదివితే మంచి అవకాశాలు లభిస్తాయని, ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి సేవ చేయగలమని విద్యార్థులను ప్రేరేపించారు.ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ మేనేజర్ జగదీష్ పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పుస్తకాలు చదవడం వలన ఏకాగ్రత, సృజనాత్మకత మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మంచి అలవాట్లు అభివృద్ధి చెందుతాయి, తరగతి గదిలో చురుకుగా పాల్గొనగలుగుతారు, ఉపాధ్యాయులు బోధించిన విషయాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. అలాగే నైతిక విలువలు, గౌరవ భావం మరియు సమాజంపై బాధ్యతాభావం పెరుగుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు కార్తిక్, శ్రీకాంత్, శృతి, తులసి, లావణ్య, చింతగూడ ఛాంపియన్స్ మౌనిక, మనస, నెరెల్లచెరువు ఛాంపియన్ మౌనిక, వాలంటీర్ శ్రీనాథ్ పాల్గొన్నారు.