PS Telugu News
Epaper

నిర్వాసితులకు మూడు రోజుల్లో పరిహారం ఇవ్వడం ప్రారంభిస్తాం.

📅 30 Apr 2026 ⏱️ 6:15 PM 📝 తెలంగాణ
Listen to this article

మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి హామీ

పయనించే సూర్యుడు మే 1 మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల్లో భాగంగా నిర్వాసితులైన ఊట్కూరు, పేరపల్ల రిజర్వాయర్ లలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు వెంటనే పరిహారం డబ్బులు ఇప్పించాలని నిర్వాసిత సంఘం నాయకులు మరియు రైతులు మంత్రిని కోరడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి. మాట్లాడుతూ మూడు రోజులలో పరిహారాన్ని ఇచ్చుటకు ప్రారంభించిన తర్వాతే పనులను చేపట్టడం జరుగు తుందన్నారు. మంత్రి వాకిటి శ్రీహరిని. కలిసిన వారిలో నిర్వాసితుల సంఘం నాయకులు జి. వెంకట్రాంరెడ్డి, యం. గోపాలరెడ్డి, ఉట్కూర్ రైతు నాయకులు వై. జనార్ధన్ రెడ్డి, యం. బాలిరెడ్డి రైతులు జెసిబి తిప్పన్న, కర్రెమోళ్ల వెంకటేష్ , ఎండి.బికార్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top