భీంగల్ మండలంలో సొసైటీ ఐకెపి వరి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కనుగోలు చేయడం లేదని తక్షణమే స్పందించి ధాన్యం కనుగోలు చేయాలని వినతిపత్రం

పయనించే సూర్యుడు 30 ఏప్రిల్ 20 26 నిజామాబాద్ స్టాపర్ టీ కె గంగాధర్ ; బాల్కొండ నియోజకవర్గం లో
భీంగల్ మండల బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గురువారం రోజు నూతనంగా బదిలీపై వచ్చిన స్థానిక తాహాసీల్దార్ కిరణ్ కుమార్ ని మర్యాద పూర్వకంగా కలసి భీంగల్ మండలంలో సొసైటీ మరియు ఐకేపీ వరి కొనుగోలు కేంద్రాలలో దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేయడం లేదని తక్షణమే స్పందించి ధాన్యం కొనుగోలు చేయాలని వినతిపత్రం సమర్పించారు, మండల అధ్యక్షులు అరె రవీందర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో ఇప్పటికే అన్ని రకాల వరి ధాన్యం పై 40 కిలోల బస్తా పై 1 కిలో 800 గ్రాములు అంటే ఒక్క క్వింటాలుకు 4 కిలోల 500 గ్రాములు అయితే ఒక్క కాలి సంచి బరువు 600 గ్రాములు అంటే రెండున్నర కాలి సంచుల బరువు 1500 గ్రాములు పోను 3 కిలోల కడ్తా రైతుల నుండి కొనుగోలు కేంద్రాల వాళ్లు అక్రమంగా శ్రమ దోపిడీ చేస్తున్నారు,
ఇలా క్వింటాలుకు 3 కిలోలు అధికారికంగా కటింగ్ చేస్తూ మళ్ళా దొడ్డు రకం ధాన్యంకు ఇంకా అదనంగా మరో మూడు,నాలుగు కిలోల కడ్తా అంటున్నారు ఇట్టి విషయంలో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకొని రైతులకు మేలు చేయాలి. రైతులు ఇదేమి దోపిడీ అని అడిగితే మీరు వడ్లను చిన్ని పట్టడం లేదు కాబట్టి ఇంత కడ్తా కటింగ్ చేస్తున్నాం అంటున్నారు వాస్తవ పరిస్థితులు వేరు వున్నాయి నూతన వరి కోత యంత్రాలలో ఉన్న జాలిలలో వడ్లను జాలి పట్టి వస్తున్నాయి కాబట్టి ఈ యొక్క రైతుల శ్రమ దోపిడీ ని అరికట్టాలని ప్రభత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో కుప్కల్ సర్పంచ్ నర్సింగ్ రావు,చెంగల్ ఉప సర్పంచ్ నాతి మోహన్ గౌడ్,బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ యోగేశ్వర నర్సయ్య,మండల ఉపాధ్యక్షులు మహేందర్,BJYM మండల అధ్యక్షులు శెట్టి ప్రేంచంద్,కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు తక్కూరి అంజయ్య,సీనియర్ నాయకులు ముదెడ్ల శ్రీనివాస్,ST మోర్చా ఉపాధ్యక్షులు వెంకటేష్ నాయక్ మరియు నాయకులు పాల్గొన్నారు..