నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు డిసిసి అధ్యక్షుడు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం .

July 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.16.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ డిసిసి అధ్యక్షుడు నరేష్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో తన ఉనికిని కాపాడుకోవడానికి ప్రశాంత్ రెడ్డి నిరాహార దీక్ష చేయడం జరిగింది. 2022 జూన్ 2వ తేదీన భీంగల్ పట్టణంలో 35 కోట్లతో 100 పడకల ఆస్పత్రికి ఫౌండేషన్ వేసినప్పుడు మూడు నెలల్లో నిర్మిస్తామని చెప్పి 18 మాసాలు నత్త నడకన సాగించి చివరకు 17 కోట్ల పనులు మాత్రమే చేశారు. సుమారు 6 కోట్ల రూపాయలతో చేపల మార్కెట్ కొరకు మంజూరు చేసుకొని 18 మాసాలలో 1.5 కోట్ల పనులు మాత్రమే చేశారు. పురాతన కట్టడంగా ఉన్న తహసీల్ కార్యాలయాన్ని కూలగొట్టి ప్రజలకు అందుబాటులో లేకుండా 2 కిలోమీటర్ల దూరంలో st హాస్టల్ లోకి మార్చడం జరిగింది.రోడ్ నిర్మాణం కొరకు 25 కొరకు మంజూరు చేసుకొని అక్కడ 17 కోట్ల వరకే పనులు చేశారు. దానికి మహేష్ కుమార్ గౌడ్ గారు మూడు కోట్లు నిధులు ఇప్పించడం జరిగింది మరో నాలుగున్నర కోట్ల పనులు పూర్తి అయినాయి వాటికి కూడా బిల్లు ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. అదే సమయంలో హైదరాబాదులో సచివాలయం కొరకు 500 కోట్లు అంచనా పెట్టుకొని నీ ఆధ్వర్యంలో మరో 500 కోట్లు అదనంగా మంజూరు చేసుకొని సుమారు 1000 కోట్లు మంజూరు చేసుకొని తొమ్మిది మాసలలో దానిని పూర్తి చేయడం జరిగింది. మరి అదే సమయంలో ఎందుకు బాల్కొండ నియోజకవర్గంలో జరిగే పనులను పూర్తి చేయలేదు అని నగేష్ రెడ్డి ప్రశ్నించారు. అక్కడ 1000 కోట్లతో పనులను 9 మాసాలలో పూర్తి చేసిన నీవు బాల్కొండలో 50 కోట్లతో 18 మాసాలలో పనులు పూర్తి చేయాలని చిత్తశుద్ధి లేదా అని అన్నారు. నీ హయాంలో పనులను మంజూరు చేసుకుని వాటిని ఆలస్యం చేసి ఇప్పుడు మా పిసిసి అధ్యక్షునిపై అభండాలు వేయడం సరైనది కాదు. సర్పంచ్ ఎన్నికల్లో సుమారు 75% మేము గెలుచుకున్నాము భీంగl మున్సిపల్ ఎన్నికల్లో నిన్ను చిత్తుచిత్తుగా ఓడించి ఆ స్థానాన్ని మేము కైవసం చేసుకున్నాము. మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నాము.సునీల్ రెడ్డి సారథ్యంలో మున్సిపల్ లో 8 స్తనాలు గెలుచుకొని మున్సిపల్ చైర్మన కైవసం చేసుకున్నాము.మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు.,10 సంవత్సరాలు అధికారంలో ఉండి నిజామాబాద్ కు ఏమి చేశావని ప్రశాంత్ రెడ్డిని నగేష్ రెడ్డి ప్రశ్నించారు. నిజామాబాద్లో బైపాస్ రోడ్డు పనులు నత్తనడకన నడిచాయి. జిల్లాలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన పనులే తప్ప మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వచ్చాక పనులు నడుస్తున్నాయి. 38 వేల కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తీసుకువచ్చి దానికి మేము 5000 వేల కోట్లు ఖర్చు చేస్తే మీరు వచ్చాక 6 వేల కోట్లు ఖర్చు చేసి సుమారు 11 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి కాళేశ్వరం తీసుకువచ్చి మొదట 88 వేల కోట్ల డిజైన్ తెచ్చి తర్వాత లక్ష 11 వేల కోట్ల డిజైన్ తీసుకువచ్చి ఖర్చు పెట్టారు. ఇప్పడి వరకు దాని పనులు నత్త నడకన నడుస్తున్నాయి. మంచిప్ప 20,21 ప్యాకేజ్ కు సుదర్శన్ రెడ్డి గారు మంత్రిగా 9 వేల 500 కోట్లు ఖర్చు చేశారు మీరు వచ్చాక 300 కోట్లు ఖర్చు చేస్తే మంచిప్ప ప్యాకేజ్ పూర్తి అవుతుందే.సుమారు లక్ష పై ఎకరాలు సాగు అవుతుండే. మళ్ళీ దానిని మళ్ళీ డిజైన్ మార్చి 3 వేళ కోట్లకు తీసుకువెళ్లారు.కేవలం 1600 కోట్లతో పైపులు వేసారు అంతే.ఎందుకంటే అందులో కమిషన్ తీసుకున్నావు. మిషన్ భగీరథ పథకంతో ఎంతో అవినీతి చేశావు. ఆ అవినీతి సొమ్ము ఆరగాకనే ప్రశాంత్ రెడ్డి దొంగ నిరహార దీక్ష చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకపైపు సంక్షేమాన్ని,మరోపక్క అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అన్ని నెరవేరుస్తున్నాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్త శుద్ధితో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నాము, పది సంవత్సరాలలో మీరు ఎన్నడు ఇవ్వని రేషన్ కార్డులను మేము అధికారంలోకి వచ్చాక అర్హులకు రేషన్ కార్డులు మంజూరు చేశాం. అందరికీ సన్నబియం ఇస్తున్నాము. 5 లక్షలు నుండి 10 లక్షల వరకు పెంచడం జరిగింది. రైతులకు రైతు బంధు మీలాగా గుట్టలకు వెయ్యడం లేదు పంట పండించే భూములకు వేస్తున్నారు. గతం బి ఆర్ ఎస్ ఆధ్వర్యంలో ఇచ్చిన దళిత బందులో కమిషన్ లు తీసుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఇచిన హామీలు నెరవేరుస్తున్నాం. లింబాద్రి గుట్టకు 4 కోట్లు మంజూరు చేయడం జరిగింది. భీమ్గల్ పట్టణానికి అదనంగా 15 కోట్లు ఇచ్చాము.మేము చేస్తున్న సంక్షేమం చూసి ఓర్వలేక ప్రశాంత్ రెడ్డి దొంగ దీక్ష. రాబోయే రోజుల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కి ప్రజలు పట్టం కడతారు. ప్రశాంత్ రెడ్డి మీరు మీ పార్టీని కాపాడుకోవడానికే దొంగ దీక్ష.నీకున్న రోడ్ల భావనల శాఖ ద్వారా జిల్లాకు ఏం తెచ్చావు.ఆగస్టు 15 వరకు అని అల్టిమేట్ జారి చేశావు. నవ ఏమి చేసిన అంచ లంచెలుగా మేము ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చి తీరుతాం మాకు 5 సంవత్సరాల గడువు ఇచ్చారు అంతలోపు ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం మళ్ళీ అధికారంలోకి మేమే వస్తాం.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రత్నాకర్ గౌడ్, గాదరి గోపి,కోశాధికారి భక్త వత్సలం, జిల్లా యస్టీ సెల్ అధ్యక్షులు యాదగిరి, జావీద్ అక్రం, స్పోక్స్ పర్సన్ లింగన్న, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు విపుల్ గౌడ్, బీసీ సెల్ అధ్యక్షుడు నరేందర్ గౌడ్, బాల నర్సయ్య, రవి, గణేష్, పూర్ణ చందర్, కిష్టా గౌడ్ తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper