చుక్క నీటి కోసం కిలోమీటర్ల నడక.. అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థుల ఆగ్రహం

July 16, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు జూలై 16 (సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలంలో
నాదెండ్ల వారి కండ్రిగ గ్రామంలో నెలరోజులుగా తీవ్ర తాగునీటి సమస్యతో గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. గ్రామంలో నీరు అందుబాటులో లేక మహిళలు, వృద్ధులు కిలోమీటర్ల దూరం వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. నాలుగేళ్ల క్రితం గ్రామంలో తాగునీటి సమస్యకు పరిష్కారంగా ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మించినప్పటికీ, ఇప్పటి వరకు పైప్‌లైన్లు ఏర్పాటు చేయకపోవడంతో ఒక్కరోజు కూడా ట్యాంక్ ద్వారా నీటి సరఫరా జరగలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోట్ల రూపాయల ప్రజాధనం వెచ్చించి నిర్మించిన ట్యాంక్ ప్రజలకు ఉపయోగపడకుండా నిరుపయోగంగా నిలిచిపోయిందని ఆరోపిస్తున్నారు. గత నెల రోజులుగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులుఎదుర్కొంటున్నా సంబంధిత అధికారులు, సచివాలయ సిబ్బంది స్పందించకపోవడంపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పైప్‌లైన్ పనులు పూర్తి చేసి, ట్యాంక్‌ను వినియోగంలోకి తీసుకువచ్చి గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని, అధికారులను డిమాండ్ చేస్తున్నారు.

🌐 Select Language:
📰 ePaper