పల్సి గ్రామంలో విద్యా భారతి పాఠశాల విద్యార్థులు రైతుల కోసంవానదేవా కరుణించరావా
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: విద్యార్థులతో కప్పతల్లి ఆటవర్షాలు కోసం విద్యార్థులు పూజలువర్షాలు జాడలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్న కుబీర్ మండల పల్సి గ్రామంలో రైతుల కోసం విద్యా భారతి పాఠశాల విద్యార్థులు వినూత్న రీతిలో వాన దేవుడి కి ప్రార్థించారు. ఇప్పటికే రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, కూలీల కోసం భారీగా పెట్టుబడులు పెట్టారు. అయితే ఆశించిన స్థాయిలో వర్షాలు కురువకపోవడంతో ఆ పెట్టుబడులు నీరు గారే పరిస్థితి నెలకొంది. కంటికి రెప్పలా పెంచుకున్న పంట కండ్ల ముందే ఎండిపోవడంతో రైతు నిరాశతో ఆకాశం వైపు ఎదురుచూస్తున్నాడు. వానదేవుడు ఒక్కసారైనా కరుణించవా అంటూ విద్యార్థులు, ఉపాధ్యాయులు శతకోటి దేవతలను వేడుకుంటున్నారు.