ముఖ్యమంత్రి ని విమర్శించే స్థాయి రాకేష్ రెడ్డికి లేదు.

July 3, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడుD.3.7.2026 నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్.ఈ రోజు శుక్రవారం రోజున జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నగేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని విమర్శించే స్థాయి రాకేష్ రెడ్డికి లేదు.జాతీయ బీజేపీ అధ్యక్షుడు తెలంగాణకు వచ్చి ముఖ్యమంత్రి పై తప్పుగా మాట్లాడితే మా ముఖ్యమంత్రి దానికి స్పందించారు.దానిపై నువ్వు ముఖ్యమంత్రి ని విమర్శించడం సరికాదు.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ని రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మని సవాల్ విసిరావు కదా నువ్వు ఆర్మూర్ నియోజకవర్గంలో రాజీనామా చేయు నీపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిలబెట్టి నిన్ను చిత్తుచిత్తుగా ఓడిస్తాము.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఆర్మూర్ మున్సిపాలిటీ కైవసం చేసుకోలేని నువ్వు కేవలం 5 వార్డు లు గెలిచి ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ని రాజీనామా చేయమని మాట్లాడుతున్నావా.నీపై పోటీకి మహేష్కుమార్ గౌడ్ కాదు జిల్లా నాయకులం మేం సరిపోతాంమహేష్ కుమార్ గౌడ్ సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో జిల్లాలో అన్ని మున్సిపల్ సీట్లను కాంగ్రెస్ ప్రభుత్వం కైవసం చేసుకుంది.ఈ జిల్లాలో మూడు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, ఇంజనీరింగ్ కాలేజీ ,అగ్రికల్చర్ కాలేజీ మేము తీసుకు వచ్చినది.జిల్లా అభివృద్ధిపై రాకేష్ రెడ్డి సిద్ధంగా ఉండాలని సవాల్ చేస్తున్నాము.కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం నీట్ పేపర్ లీకేజీ తో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే యువకులు రోడ్లపైకి వచ్చి విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే దానిపైన ఏ రోజన్న రాకేష్ రెడ్డి నువ్వు మాట్లాడావా.?ట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతుంటే వాటిపైన ఏరోజైనా స్పందించావా..?నరేంద్ర మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎన్నికల్లో వాగ్దానం చేశాడు మరి ఇప్పుడు వాటిని విస్మరించడం జరిగింది దానిపై ఎందుకు రాకేష్ రెడ్డి మాట్లాడడం లేదు.ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టడం బిజెపి యొక్క రాజకీయం.మోడీ గారు ప్రతి ఒక్కరికి 15 లక్షల రూపాయలను ఇస్తానని చెప్పిన హామీ ఇప్పటివరకు నెరవేరే లేదు.వీటన్నింటి పైన కేంద్రంలో మోడీ ని అడగడానికి వెళ్దాం మీతో పాటు మేము వస్తాము ఆయన అన్నారు.పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తాతల కాలం నుండి కొన్ని వేల ఎకరాలు ఉన్నాయని వారు ఎంతో మందికి దానధర్మాలు చేస్తున్నారని ఇటీవల భీంగల్ లో స్కూల్ నిర్మాణానికి 11 ఎకరాల భూమిని ఇచ్చిన గొప్ప వ్యక్తి మహేష్ కుమార్ గౌడ్ఆ యనను విమర్శించే స్థాయి మీకు లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాల 8 నెలల కాలంలో అదిలాబాదులో ఎయిర్ పోర్టు తీసుకువచ్చాము
వడ్లు మక్కలు 100% కొన్నాం. సుమారు జిల్లాలు 2000 కోట్లు ఇప్పటి వరకు చెల్లించాం.ప్రతి నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాము500 కి వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాముమహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అందించడం జరిగిందిపేదవానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామురైతులకు రైతుబంధు రైతు రుణమాఫీ సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వడం జరుగుతుంది.కాంగ్రెస్ పార్టీ వీటన్నింటినీ చేస్తుంటే ఓర్వలేక రాకేష్ రెడ్డి కేవలం ఆయన ఉనికిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి పై మహేష్ కుమార్ గౌడ్ పై సుదర్శన్ రెడ్డి పై అనుచిత వాక్యాలు చేస్తున్నారు.మరొకసారి మా కాంగ్రెస్ నాయకులపై అణిచిత వాక్యాలు చేస్తే మిమ్మల్ని రోడ్లపైకి ఊరికించి కొడతామని నగేష్ రెడ్డిహెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ హాందాన్, డిసిసి కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, TPCC అధికార ప్రతినిధి ఏబీ శ్రీనివాస్, నూడ చైర్మన్ కేశ వేణు,గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతరెడ్డి రాజారెడ్డి,మాజీ మున్సిపాల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రత్నాకర్ గౌడ్,జిల్లా కాంగ్రెస్ కోశాధికారి భక్తవస్తలం,జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్,జిల్లా యూత్ అధ్యక్షుడు విపుల్ గౌడ్,జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు సంతోష్,జిల్లా St అధ్ అధ్యక్షుడు యాదగిరి,జిల్లా కార్యదర్శులు గణేష్,సుభాష్,పుప్పాల రవి,వినోద్, AMC డైరెక్టర్ రఘు,బంటు బలరాం మరియు తదితరులు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper