బైంసా పట్టణంలో రామాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: మంజూరు పత్రాన్ని అందజేసిన ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ బైంసా పట్టణంలోని రామ్ లీలా మైదానంలో నిర్మించే శివ రామాలయ నిర్మాణానికి 50 లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు* ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు. గురువారం బైంసాలోని తన నివాసంలో అక్కడి వాసులకు మంజూరు పత్రాన్ని అందజేశారు. గతంలో ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిధులు ఇవ్వడం జరిగిందని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ తుమొల్ల దత్తాత్రి, కౌన్సిలర్ చింతపండు రజిత మహేష్ మాట్లాడుతూ భైంసా పట్టణంలో రామ ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసినందుకు ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు చెప్పారు, ఆలయ నిర్మాణం పై ప్రత్యేక దృష్టి సారించడం, శుభసూచకమని, అదేవిధంగా ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ హాయంలోనే బైంసా పట్టడానికి పెద్ద మొత్తంలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కావడం జరిగిందన్నారు. అనంతరం నిధులు మంజూరు చేసినందుకు కౌన్సిలర్ తో పాటు కాలనీవాసులు ఎమ్మెల్యేను శాలువాతో సత్కlరించి కృతజ్ఞతలు చెప్పారు.కార్యక్రమం లో పట్టణ బిజెపి అధ్యక్షులు రావుల రాము, కౌన్సిలర్ అమోల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.