తెలంగాణ

భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు

భీంగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్టు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ టీ కే గంగాధర్ నిజామాబాద్ జిల్లా భీంగల్ పోలీస్ స్టేషన్ మూడు ముక్కల పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులు పట్టివేత – రూ.11,410 నగదు, 7 సెల్‌ఫోన్లు, 7 ద్విచక్ర వాహనాలు, 52 పేక ముక్కలు స్వాధీనం.తేదీ 08-11-2026 రాత్రి సమయంలో భీంగల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎం. చిరంజీవికి, భీంగల్ మండలంలోని భీంగల్ గ్రామం నంది గల్లీలో గల గౌడ సంఘం వద్ద కొంతమంది వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతున్నట్లు నమ్మదగిన సమాచారం అందింది.వెంటనే ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని తనిఖీ చేయగా, ఏడుగురు వ్యక్తులు డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకుని, పంచుల సమక్షంలో కన్ఫెషన్ కమ్ సీజ్ పంచనామా నిర్వహించి క్రింది వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.స్వాధీనం చేసుకున్న వస్తువుల వివరాలు:నగదు – రూ.11,410/-సెల్‌ఫోన్లు – 7 ద్విచక్ర వాహనాలు – 7 పేక ముక్కలు – 52 పచనామా పూర్తయిన అనంతరం నిందితులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తేదీ 09-11-2026 తెల్లవారుజామున భీంగల్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.భీంగల్ పోలీసుల విజ్ఞప్తి:ప్రజలు ఎవరూ జూదం, పేకాట మరియు బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడవద్దని, ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని భీంగల్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

    ఇ-పేపర్

    PAYANINCHE SURYUDU NEWS