ప్రశాంత్ రెడ్డి తాను ఎమ్మెల్యే గా కనీస బాధ్యత కూడా లేదు. కేవలం ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని పెట్టుకున్నారు ఆయనకు ప్రజలే బుద్ధి చెబుతారు.
పయనించే సూర్యుడుD.16.7.2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్. — బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్.. ఈరోజు భీంగల్ మండల కేంద్రంలో వంద పడకల ఆసుపత్రి వద్ద మీడియా సమావేశంలొ బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18-06-2022 రోజున 35 కోట్ల అంచనా వ్యయంతో పది పడకల ఆసుపత్రిని వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి ఆసుపత్రి నిర్మాణానికి భూమి పూజ చేసి అప్పుడు రోడ్లు మరియు భవనముల మంత్రిగా ఉన్న ప్రశాంత్ రెడ్డి వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావు ని పిలిపించుకొని ఎనిమిది అంటే ఎనిమిది నెలల్లోనే ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చి ఆసుపత్రి నిర్మాణానికి డబ్బు ఇవ్వకుండా ప్రజలను మోసం చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మున్సిపల్ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయడానికి మూడు కోట్ల రూపాయల నిధులను మంజూరు చేశారు ఇంకా అవసరమైన మేరకు నిధులను మంజూరు చేసి ఆసుపత్రిని పూర్తి చేస్తాం.వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్ కు 2021 లొ శంకుస్థాపన చేశారు. TUFIDC నుండి కోటి, ప్రత్యేక నిధుల నుండి 2 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు దానికి ఒక్క నయా పైసా బిల్లు కూడా చెల్లించలేదు.భీంగల్ అభివృద్ధికి మొదటి అడ్డంకి ప్రశాంత్ రెడ్డే కమిషన్లు తీసుకోవడం ఆయనకు ఆనవాయితీ పనులు చేయాలంటే కాంట్రాక్టర్లు భయపడేలా చేశారు. కాంట్రాక్టర్లను పనులు చేయాలని అడిగితే గత ప్రభుత్వంలో చేసిన పనులు తాలూకు బిల్లులన్ని పెండింగ్లో ఉన్నాయి అంటున్నారు. వంద పడకల ఆసుపత్రిని అతి తొందరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా పూర్తి చేస్తుంది ప్రజలకు అందుబాటులోకి తెస్తుంది.గతంలో రావణా శాఖ మంత్రిగా ఉండి కూడా భీంగల్ బస్ డిపో ను తెరిపించ లేకపోయారు. ఏదో ఎన్నికల ముందు నాలుగు బస్సులను ఆర్మూర్ నుండి తెచ్చి పార్కింగ్ చేసి బస్ డిపో అన్నాడు.
శాసన సభ ఎన్నికల సందర్భంగా గానీ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా గానీ మేము ఏనాడు బస్ డిపో తెరిపిస్తామని చెప్పలేదు. వారిలా దొంగ మాటలు చెప్పడం కాంగ్రెస్ పార్టీకి రాదు.భీంగల్ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టుబడి ఉంది అభివృద్ధి కొరకు 54 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. చిత్తశుద్ధితో పని చేస్తున్నాం..
యూరియా యాప్ విషయంలోనూ రైతులలొ గందరగోళం సృష్టించే ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నం సఫలీకృతం కాలేదు. నీళ్ల విషయంలోనూ ప్రశాంత్ రెడ్డి రాజకీయం చేస్తున్నారు. రైతులకు నీళ్లు ఇవ్వాల్సిందే తప్పకుండా ప్రభుత్వం నీళ్లు ఇస్తుంది.SRSP లొ 25 TMC ల నీళ్ళున్నా లీకేజీ నీళ్లు అడిగిన పాపానికి బాల్కొండ నియోజకవర్గ రైతుల మీద కేసులు పెట్టిన చరిత్ర ప్రశాంత్ రెడ్డిది. అసలు రైతుల గురించి మాట్లాడే అర్హత ప్రశాంత్ రెడ్డికి లేదు.SRSP పునరుజ్జీవనం పేరుమీద కమిషన్లు మింగిన ప్రశాంత్ రెడ్డి కాళేశ్వరం పథకం ద్వార ఒక్క TMC నీటినైనా SRSP లొ నింపారా ?ప్రశాంత్ రెడ్డి గుండెల మీద చెయ్యి వేసుకొని ప్రజలకు నిజాన్ని వివరించాలి.డూప్లికేట్ ఇంజనీర్ గా ప్రశాంత్ రెడ్డి కట్టిన చెక్ డ్యాంల వలె పునరుజ్జీవన పథకం మిగిలిపోయింది. కరువు పరిస్థితులు తెలిసి కూడా ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా లబ్ధి పొందడానికి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. రైతులను నిండా మించిన ప్రశాంత్ రెడ్డి ఈరోజు దొంగ మాటలు చెప్తే నమ్మే పరిస్థితుల్లో రైతులు లేరు.ప్రశాంత్ రెడ్డి ఇకనైనా డ్రామాలు ఆపి తాను ఎమ్మెల్యేనని తనను తాను గుర్తుంచుకొని బాధ్యతాయుతంగా మెలగాలని హితవు పలికారు.కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు