ఝరి ‘బి’ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ పనులను పరిశీలించిన హౌసింగ్ ఏ ఈ మహేష్ బాబు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలువెలుగుల చక్రపాణి: ఝరి బి గ్రామంలో త్వరగా ఇళ్లు పూర్తి చేయాలి: హౌసింగ్ ఏఈ మహేష్ బాబు ఝరి బి ఝరి ‘బి’ లో ఇందిరమ్మ ఇళ్ల స్లాబ్ పనుల పరిశీలన * త్వరగా ఇళ్లు పూర్తి చేయాలి: హౌసింగ్ ఏఈ మహేష్ బాబు ఝరి బి మండల పరిధిలోని ఝరి బి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) మహేష్ బాబు గురువారం పరిశీలించారు. గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇళ్ల స్లాబ్ పనులను ఆయన స్వయంగా తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏఈ మహేష్ బాబు మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు వేగవంతం చేయాలని సూచించారు. గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించని వారు, వివిధ దశల్లో నిలిపివేసిన మిగిలిన లబ్ధిదారులు కూడా వెంటనే స్పందించి, తొందరలోనే తమ ఇళ్లను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు ముగించుకోవాలని లబ్ధిదారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్, ఝరి ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యురాలు జోన్దలే యశోద సాయినాథ్, మల్లేష్ లబ్ధిదారులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.మండల పరిధిలోని ఝరి బి గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను హౌసింగ్ ఏఈ (అసిస్టెంట్ ఇంజనీర్) మహేష్ బాబు గురువారం పరిశీలించారు. గ్రామంలో లబ్ధిదారులు నిర్మించుకుంటున్న ఇళ్ల స్లాబ్ పనులను ఆయన స్వయంగా తనిఖీ చేసి, నాణ్యతా ప్రమాణాలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఏఈ మహేష్ బాబు మాట్లాడుతూ… ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను లబ్ధిదారులు వేగవంతం చేయాలని సూచించారు. గ్రామంలో ఇళ్ల నిర్మాణాలు ఇంకా ప్రారంభించని వారు, వివిధ దశల్లో నిలిపివేసిన మిగిలిన లబ్ధిదారులు కూడా వెంటనే స్పందించి, తొందరలోనే తమ ఇళ్లను పూర్తి చేసుకోవాలని ఆయన కోరారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనులు ముగించుకోవాలని లబ్ధిదారులకు వివరించారు.ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కమిటీ సభ్యుడు గైక్వాడ్ సాయినాథ్, ఝరి ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యురాలు జోన్దలే యశోద సాయినాథ్, మల్లేష్ లబ్ధిదారులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.