పి.వి. వెంకయ్య పార్థివదేహానికి నివాళులర్పించిన జనసేన నాయకులు
పయనించే సూర్యుడు జులై 18 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన సీనియర్ నాయకుడు పి.వి. రమణ తండ్రి పి. వెంకయ్య మృతిపట్ల జనసేన పార్టీ నాయకులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.వెంకయ్య మృతి విషయం తెలిసిన వెంటనే కూకట్‌పల్లి నియోజకవర్గ జనసేన పార్టీ మాజీ ఎమ్మెల్యే అభ్యర్థి ముమ్మారెడ్డి ప్రేమ్‌కుమార్, పార్టీ నాయకుడు కొల్లా శంకర్‌తో కలిసి వారి నివాసానికి చేరుకుని వెంకయ్య పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా పి.వి. రమణతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించిన ప్రేమ్‌కుమార్, వెంకయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని కుటుంబ సభ్యులకు ప్రసాదించాలని భగవంతుడిని కోరారు. జనసేన పార్టీ ఎల్లప్పుడూ బాధిత కుటుంబానికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు పాల్గొని పి. వెంకయ్యకు ఘనంగా నివాళులర్పించారు.