108 అంబులెన్స్‌లో గర్భీణీ ప్రసవం..తల్లి బిడ్డ క్షేమం
ఆపద సమయంలో ఆపద్బాంధవులుగా నిలుస్తున్న 108అంబులెన్సు సేవలు
108 అంబులెన్స్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపిన- బంధువులు
జిల్లా ప్రజలు అత్యవసర 108 అంబులెన్స్ సేవలు వినియోగించుకోవాలి- సునీల్ కుమార్ (డిస్టిక్ మేనేజర్)
పయనించే సూర్యుడు జులై 19 నారాయణపేట జిల్లా: (మద్దూర్ మండలం):108 అంబులెన్స్‌లో ఓ మహిళ శిశువుకు జన్మించిన ఘటన శనివారం మద్దూరుమండల కేంద్రంలో చోటుచేసుకుంది. రేణువట్ల గ్రామానికి చెందిన ” కవిత మూడో కాన్పు నిమిత్తం ‘పురిటి నొప్పులతో బాధపడుతుండగా.. కుటుంబసభ్యులు.. దగ్గర్లో ఉన్న మద్దూరు కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రానికి తరలించారు, అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత గర్భిణి స్త్రీకి ఉమ్మనీరు పోవడంతో, మెరుగైన వైద్యం కోసం దగ్గరలో ఉన్న నారాయణపేట జిల్లా ఆస్పత్రి 108 లో రిఫరల్ చేసినారు. దీంతో తక్షణమే కోస్గి 108 అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకొని, గర్భిణీ స్త్రీని నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో, క్యాతను పల్లి గ్రామ మార్గమధ్యలో టెక్నీషియన్ వెంకటేష్ “ఈ ఆర్ సి పి “డాక్టర్ శివ గారి సూచనలతో అంబులెన్స్ లోనే ప్రసవం చేసినారు, గర్భిణీ స్త్రీ కి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. అనంతరం నవజాత శిశువుకు తగు పరిచర్యలు చేస్తూ , ఆక్సిజన్ అందిస్తూ తర్వాత వారిని దగ్గర్లో ఉన్న నారాయణపేట జిల్లా ఆసుపత్రికి తరలించామని 108 అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. అక్కడ వైద్యులు పరిశీలించిన తర్వాత తల్లి బిడ్డ క్షేమమని తెలిపారు అత్యవసర సమయంలో ఆపద్బాంధవులు చాకచాక్యంగా, సమయస్ఫూర్తితో వ్యవహరించి..తల్లిబిడ్డల ప్రాణాలను కాపాడిన108 అంబులెన్స్ సిబ్బంది, పైలెట్ : శంషుద్దీన్ టెక్నీషియన్ : వెంకటేష్ లను బాధిత కుటుంబసభ్యులు, ఆస్పత్రి వైద్యులు అభినందించారు.