మాతృభాష ప్రాధాన్యతపై పరిశోధన చేసిన డా. రవికుమార్‌కు ఘన సన్మానం

July 18, 2026 | తెలంగాణ

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో: భైంసా పట్టణంలోని గోపాల్‌రావ్ పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీపీడీసీ ఆధ్వర్యంలో అభినందన సభబైంసా: మాతృభాష విలువలు, ప్రాధాన్యత మరియు సమాజ నిర్మాణంలో దాని పాత్రపై విశిష్ట పరిశోధన చేసి పీహెచ్.డి. (డాక్టరేట్) పట్టా పొందిన గోపాల్‌రావ్ పటేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా. రవికుమార్ ని కళాశాల సీపీడీసీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ డా. రఘునాథ్ మాట్లాడుతూ, డా. రవికుమార్ సాధించిన డాక్టరేట్ వ్యక్తిగత విజయమే కాకుండా కళాశాలకు గర్వకారణమని పేర్కొన్నారు. మాతృభాషపై ఆయన చేసిన పరిశోధన విద్యా, సాంస్కృతిక రంగాలకు విలువైన మార్గదర్శకంగా నిలుస్తుందని అన్నారు.కళాశాల సీపీడీసీ అధ్యక్షులు డా. నాగేశ్ మాట్లాడుతూ, మాతృభాష అనేది మన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యక్తిత్వానికి మూలాధారమని అన్నారు. నేటి యువత, ముఖ్యంగా ఆంగ్ల మాధ్యమంలో చదివే విద్యార్థుల్లో కూడా మాతృభాష పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించేందుకు డా. రవికుమార్ చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. ఆయన సాధించిన ఈ విజయం మరెందరో అధ్యాపకులకు, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు.అనంతరం డా. రవికుమార్ ని శాలువా, పుష్పగుచ్ఛంతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల ప్రధాన కార్యదర్శి మనోజ్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. భీంరావు, డా. ఓం ప్రకాశ్, డా. శంకర్, డా. సంతోష్, బోటనీ అధ్యాపకులు, కిషన్, రాజయ్య, కళాశాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని డా. రవికుమార్ కు అభినందనలు తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper