పయనించే సూర్యుడు జనవరి 11(పాల్వంచ టౌన్ ప్రతినిధి గడ్డం నరహరి) పాల్వంచ రూరల్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధి లో గల నాగారం ఆర్.టీ. ఏ చెక్ పోస్ట్ వద్ద మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ డి బీమ్ సింగ్ ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ లో భాగంగా సరైన పత్రాలు లేని వాహనాలను తనిఖీ చేసి జరిమానా విధించడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్న 12 బస్ లకు జరిమాన విధించడం జరిగింది.ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం లో కానిస్టేబుల్ ఎన్. శివయ్య మరియు చెక్ పోస్ట్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.