పయనించే సూర్యుడుD,28,10,2026 నిజాంబాద్ జిల్లా స్టాపర్ టీకే గంగాధర్, బాల్కొండ నియోజకవర్గం భీంగల్ మండల కేంద్రంలోఅర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలి!నవంబర్ 2న జరిగే ఛలో సబ్ కలెక్టర్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి— AIUKS రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్,AIUKS రాష్ట్ర కార్యదర్శి B దేవరాం పిలుపును ఇచ్చారు.
బీంగల్: పేద ప్రజల భూములను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించి, వారికి తమ భూములపై హక్కులు కల్పించాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం (AIUKS) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వి. ప్రభాకర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదే విధంగా, ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులైన పేదలందరికీ ఎలాంటి జాప్యం లేకుండా ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.ఈ సందర్భంగా బీంగల్ మండలంలోని తాళ్లపల్లి చౌరస్తాలో బుధవారం నాడు AIUKS ఆధ్వర్యంలో జరిగిన రైతుల సమావేశం లో మాట్లాడిన ఆయన, పేదలు సాగు చేసుకుంటున్న, నివాసం ఉంటున్న భూములను 22-A నిషేధిత జాబితాలో చేర్చడం వల్ల వారు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భూములపై హక్కులు లేకపోవడంతో పేదలు తమ భూములను విక్రయించుకోలేక, ఇతర అవసరాలకు వినియోగించుకోలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 2008 అటవీహక్కుల చట్టంను అమలు చేయాల్సింది అమలు చేయకుండా ఇట్టి భూములను 22A నిషేదిత భూముల జాబితాలో చేర్చడం సిగ్గు చేటు అన్నారు. గిరిజనులకు ప్రభుత్వం ఇచ్చిన భూముల్లో ట్రాక్టర్స్ తో చదును చేసే పనులు కాకుండా నాగళ్ళతో చేయాలి అనడం సిగ్గుచేటు అన్నారు.ప్రభుత్వం పేదల సమస్యలను గుర్తించి, వారి భూములను 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు మంజూరు చేసి, సొంత ఇంటి కలను నెరవేర్చాలని కోరారు. 2006 అతివి హక్కుల చట్టాన్ని అమలు చేయాలి. ఆ నేపథ్యంలోనే పురాతన వ్యవసాయ విధానాన్ని (నాగలి తోనే సాగు చేయాలి) నిబంధన ఉందని అటవీశాఖ అధికారులు గిరిజనులను, గిరిజనల పైన కేసు నమోదు చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి.రబి సీజన్ కొరకు విత్తనాల కొనుగోలుకు వెళుతున్న రైతుల నుంచి వ్యాపారులు, AEO సెల్ఫ్ డిక్లరేషన్ పైన సంతకాలు తీసుకొని వరి పంటలు సాగు చేస్తే మాది బాధ్యత లేదని విద్యుత్ కొరత వచ్చిన మమ్మల్ని అడగమని రాయించుకుని సంతకాలు తీసుకోవడం అప్రజా స్వామికి చర్యని దీని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పేదల భూముల సమస్యల పరిష్కారం, అర్హులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు తదితర డిమాండ్ల సాధన కోసం నవంబర్ 2న నిర్వహించనున్న ఛలో సబ్ కలెక్టర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వి. ప్రభాకర్ ప్రజలకు, రైతులకు, పేదలకు పిలుపునిచ్చారు.పేదల హక్కుల సాధన కోసం ప్రజలందరూ ఐక్యంగా ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు.కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ మండల కార్యదర్శి కె రాజేశ్వర్ లు మాట్లాడాగ, AIUKS ఆర్మూర్ డివిజన్ ప్రధానకార్యదర్శి రిక్క దామోదర్, డివిజన్ ఉపాధ్యక్షులు జి నడ్పినర్సయ్య, డివిజన్ నాయకులు, ఎం శ్రావణ్, బి మోహన్, మండల నాయకులు అంబిక గంగాధర్, B, ధర్మపురి జి నరేష్ తదితరులు పాల్గొన్నారు.
