
రుద్రూర్, పయనించే సూర్యుడు న్యూస్ : : రుద్రూర్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో బుధవారం ప్రత్యేక అధికారి అరవింద్ రెడ్డి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలాల అధికారులు మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం వలన నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. అదేవిధంగా విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం తదితర అంశాల పై వివరించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, తహసీల్దార్ సురేందర్ నాయక్, ఎంపివో అరవింద్, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, గ్రామపంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.