సినిమా వార్తలు

సత్తమ్మ తల్లి పూజలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థి పచ్చుమట్ల సూర్యనారాయణ రాజు( విలేకర్ రాజు)

సత్తమ్మ తల్లి పూజలతో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన కూటమి ఎంపీటీసీ అభ్యర్థి పచ్చుమట్ల సూర్యనారాయణ రాజు( విలేకర్ రాజు)

పయనించే సూర్యుడు, అక్టోబర్ 28 ముమ్మిడివరం ప్రతినిధి గ్రంధి నానాజీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గ కాట్రేనికోన మండలం కాట్రేనికోన 1 ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న పచ్చుమట్ల సూర్య నారాయణ రాజు (విలేఖర్ రాజు) మంగళవారం ప్రచారం నిర్వహించారు. కొత్తపాలెం, లచ్చిరాజు చెరువు, తామరచెరువు, దేవీ సెంటర్ తదితర గ్రామాలలో ఆయన ప్రచారం నిర్వహించారు. కూటమి నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో కోలాహలంగా ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. జడ్పీటీసీ అభ్యర్థి దండుబోలు భగీరమ్మ సత్యం కూడా ఇంటింటా ప్రచారంలో పాల్గొని రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు వేయాలని ఓటర్లను కోరారు. ముందుగా సుంకర వారి సత్తమ్మ తల్లి అమ్మవారికి విలేఖర్ రాజు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగిడి నాగేశ్వరరావు, దాట్ల పవన్, విత్తనాల బుజ్జి, తుపట పల్లి నాగు, తుపట పల్లి శ్రీను, సుంకర బుజ్జి, డి. సీతారామ కృష్ణం రాజు, పి టి వర్మ, లక్ష్మి రమణారావు, వాసంశెట్టి రాజేశ్వర రావు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బిజెపి జిల్లా ట్రెజరర్ గ్రంధి నానాజీ, శీలం సూర్యనారాయణ, మాదే యోగేశ్వరి, నేలపాటి చంచలరావు, కంచర్ల కృష్ణ, సుంకర పవిత్ర, రవి వర్మ, కోటిపల్లి సత్యనారాయణ, గెద్దాడ శ్రీను, బొక్క చిన్న, జి. సూరిబాబు, విత్తనాల వెంకట రమణ, జగడం విజయ్ కుమార్, రాగుర్తి సత్తిబాబు, శ్రీనివాసరావు, సత్యనారాయణ, వెంకటేశ్వరరావు, సత్తాల ప్రసాద్, చెల్లారి సుభాష్, రాజు, వర్మ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇ-పేపర్

PAYANINCHE SURYUDU NEWS